మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ నుంచి చర్లపల్లి రైల్వేస్టేషన్ మధ్యలోని పట్టాలపై ఓ గుర్తు తెలియని మృతదేహం రైల్వే పోలీసులకు లభ్యమైంది. రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరణించిన వ్యక్తి వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు చెప్పారు. అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు? అనే కోణంలో రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి వ్యాను బోల్తా.. ఏడుగురు మృతి