సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలో గురువారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కోమటి బండ గ్రామానికి చెందిన యాదగిరి(35), అదే గ్రామానికి చెందిన గుడికందుల గణేష్ ఇద్దరూ రాత్రి వ్యవసాయ పొలం నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్.. బైక్‌ను ఢీకొట్టడంతో యాదగిరి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో ఉన్న గణేష్‌ను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా...
గజ్వేల్ మండలానికి చెందిన బొండ్ల బిక్షపతి(35), మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామానికి చెందిన రాజు ఇద్దరు కలిసి బైక్‌పై దౌల్తాబాద్‌లో ఓ వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. మార్గ మధ్యలో రోడ్డుపై పోసిన వరి కుప్పకు ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో భిక్షపతి తలకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు తీవ్ర గాయాలు కావడంతో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కీసర మండలంలోని బంగారు ఆభరణాల దుకాణంలో చోరీ!