సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన జగదీశ్వర్‌కు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు స్వప్నకు పెళ్లవ్వగా.. రెండో కూతురు అనూష విడాకులు తీసుకోవడం వల్ల తండ్రి వద్దే ఉంటోంది. మూడో కూతురు మనీషా ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది.
జూన్ 4న జగదీశ్వర్ భార్యతో కలిసి పని మీద బయటకి వెళ్లారు. సాయంత్రం వచ్చి చూసేసరికి అనూష, మనీష కనిపించలేదు. బ్యాంక్‌కు వెళ్తున్నామని పక్కింటివాళ్లకు చెప్పినట్లు తెలిపారు. రెండో రోజు సాయంత్రం వరకు వారి కోసం వెతికిన తండ్రి పటాన్చెరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.