ETV Bharat / jagte-raho

చెరువులో దూకి మామ అల్లుడి ఆత్మహత్య - two members

దంపతుల మధ్య గొడవ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. తల్లిదండ్రులు లేని అల్లుడిని పెంచుకుంటున్న భార్యభర్తల మధ్య వివాదం ఆత్మహత్యకు కారణమయింది. ఈ ఘటన హైదరాబాద్​ కూకట్​పల్లిలో చోటుచేసుకుంది.

మ అల్లుడి ఆత్మహత్య
author img

By

Published : May 30, 2019, 4:25 PM IST

Updated : May 30, 2019, 5:16 PM IST

మెదక్​ జిల్లా పాపన్నపేటకు చెందిన ఉప్పు రాజు, రేణుక దంపతులు ఉపాధికోసం నగరానికి వచ్చి కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నారు. రాజుకు అల్లుడైన ప్రసాద్​కు తల్లిదండ్రులు లేకపోవడం వల్ల వీరి వద్దే ఉంటూ చికెన్​షాప్​లో పని చేస్తున్నాడు. ప్రసాద్​ తమ వద్ద ఉండడం ఇష్టంలేక రేణుక, రాజు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం కూడా వారి మధ్య వివాదం రేగడం వల్ల జీవితంపై విరక్తి చెందిన వారు ఆత్మహత్య చేసుకునేందుకు ఎల్లమ్మ చెరువు వద్దకు వచ్చారు. మొదట అల్లుడు ప్రసాద్​ నీటిలో దూకగా, రేణుక దూకే ప్రయత్నం చేయగా రాజు ఆమెను వెనక్కు లాగి తాను చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ​ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్​డీఆర్ఎఫ్ టీమ్‌ సహాయంతో రాజు మృతదేహాన్ని నిన్న సాయంత్రం వెలికితీయగా, ప్రసాద్‌ మృతదేహాన్ని ఈ రోజు బయటకు తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

చెరువులో దూకి మామ అల్లుడి ఆత్మహత్య
ఇవీ చూడండి: 'వయసు చిన్నది.. సీఎం బాధ్యత పెద్దది'

sample description
Last Updated : May 30, 2019, 5:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.