ETV Bharat / jagte-raho

ఆ మహిళల ఆత్మహత్యలకు కారణాలేంటి..? - మేడ్చల్ జిల్లాలో ఇద్దరు యువతుల ఆత్మహత్య

మేడ్చల్ జిల్లా జవహర్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలిక సహా ఇద్దరు మహిళల ఆత్మహత్య కలకలం సృష్టించింది. జవహర్​నగర్ డంపింగ్ యార్డు సమీపంలోని పొలం వద్ద చెట్లకు ఇద్దరు మహిళలు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు ఐదేళ్ల చిన్నారికి శీతలపానియంలో విషం ఇచ్చి హత్య చేశారు. మృతులు కరీంనగర్ జిల్లా వాసులుగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

suicide
suicide
author img

By

Published : Apr 13, 2020, 5:29 PM IST

Updated : Apr 13, 2020, 6:54 PM IST

మేడ్చల్ జిల్లా జవహర్​నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో ఇద్దరు మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి పక్కనే ఐదేళ్ల చిన్నారి మృతదేహం ఉంది. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించిన పోలీసులు... మహిళల వద్ద లభించిన సెల్ ఫోన్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్లలోని లాస్ట్​కాల్​ను సంప్రదించగా... మృతులు కరీంనగర్ పట్టణంలోని పక్కపక్క కాలనీల్లో ఉంటున్న అనూష, సుమతిగా గుర్తించారు. చనిపోయిన బాలిక అనూష కుమార్తె.

వివాదంతో శామీర్​పేటకు

మృతిచెందిన ఇద్దరు మహిళలు కూడా వివాహితులని తేల్చిన పోలీసులు వారి భర్తలతో మాట్లాడగా అసలు విషయాలు తెలుసుకున్నారు. ఈ నెల 9న కరీంనగర్ పట్టణలో కరోనా నేపథ్యంలో రేషన్ బియ్యం కోసం వెళ్లిన అనూష, సుమతిలు ఆలస్యంగా రావడంతో రెండు కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో కోపంతో ఈ నెల10న అనూష, సుమతిలు కరీంనగర్ నుంచి శామీర్ పేట వచ్చారు. అక్కడి నుంచి బండ్లగూడలో తెలిసిన చర్చి పాస్టర్ రత్నంబాబు ద్వారా గబ్బిలాలపేటకు చేరుకున్నారు. అక్కడే చర్చిలో రెండు రోజులపాటు ఉన్నారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో చర్చి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. తెల్లారే సరికి డంపింగ్ యార్డు సమీపంలోని పొలం వద్ద ఆత్మహత్య చేసుకున్నారు.

బాలికకు విషం

అనూష, సుమతిలు ఆత్మహత్యకు ముందు బాలిక ఉమామహేశ్వరికి శీతలపానియంలో విష రసాయనాలు కలిపి ఇచ్చారని, ఆ తర్వాతే వారిద్దరు చెట్లకు ఉరివేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీం... డాగ్ స్క్వాడ్​తో పరిసర ప్రాంతాల్లో అనుమానితుల కోసం గాలించారు. ఘటనా స్థలాన్ని మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి తోపాటు జవహర్​నగర్ మేయర్ కావ్య పరిశీలించారు. ముగ్గురు మృతదేహాలను శవపరీక్ష కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఆ పాస్టర్ ఎక్కడా..?

ప్రాథమిక దర్యాప్తులో అనూష, సుమతిలది ఆత్మహత్యే అని నిర్ధరించిన పోలీసులు... పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ నుంచి శామీర్ పేట వరకు ఎలా వచ్చారు. రెండు రోజులు జవహర్ నగర్​లో ఏం చేశారు. చనిపోయే ముందు భర్తలతో మళ్లీ ఏమైన గొడవ పడ్డారా. ఆశ్రయం కల్పించిన చర్చి పాస్టర్ ఏమయ్యాడు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

వాళ్ల ఆత్మహత్యలకు కారణం గొడవలేనా?

ఇదీ చూడండి: చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు యువతుల ఆత్మహత్య

Last Updated : Apr 13, 2020, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.