కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని మెంగారం సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
మోంభాజిపేట గ్రామానికి చెందిన సంగరాజు, భాస్కర్, బాలరాజు లింగంపేట నుంచి మోంభాజిపేట గ్రామానికి వెళుతున్నారు. మెంగారం వద్దకు రాగానే ఎల్లారెడ్డి నుంచి వస్తున్న కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో సంగరాజు, భాస్కర్‌లు అక్కడికక్కడే మృతిచెందగా.. బాలరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుల్లో సంగరాజుకు ఇద్దరు పిల్లలు ఉండగా.. భాస్కర్‌కి వచ్చే నెల 17న వివాహం నిశ్చయమైంది. యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి.. కొలువు కోసం వెళ్లి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు!