సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ బొల్లారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 35 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో 14 మందికి చెందిన సెల్ఫోన్లను బేగంపేట ఏసీపీ నరేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో బొల్లారం పోలీస్ స్టేషన్లో అందజేశారు.
హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్ వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసినట్లు నేరస్తులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన రూబీయుల్, అమర్‌లు చోరీలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. చోరీకి గురైన 14 సెల్ఫోన్లకు సంబంధించి పోలీసులు సమాచారాన్ని తెలుసుకుని తిరిగి వారికి అందజేశారు. మిగిలిన ఫోన్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ కేసులో బొల్లారం పోలీసులు చేసిన కృషిని బేగంపేట ఏసీపీ నరేశ్‌రెడ్డి అభినందించారు.