ETV Bharat / jagte-raho

సినిమా నిర్మాతలమంటూ పరిచయం.. ఆ తర్వాత... - two arrested who frauded unemployed ladies in kushaiguda

తాము డైరెక్టర్లు, నిర్మాతలమంటూ నమ్మబలికి రోజుకు రూ. రెండు నుంచి పది వేల వరకు ఉపాధి కల్పిస్తామని మహిళలను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిలో మరొకరు పరారీలో ఉన్నట్లు వారు వివరించారు.

two-arrested-who-frauded-unemployed-ladies-in-kushaiguda
ఉపాధిస్తామని మహిళలను మోసం చేసిన ఇద్దరు అరెస్ట్
author img

By

Published : Sep 9, 2020, 11:05 PM IST

ఉపాధి పేరిట మహిళలను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు కటకటాల్లోకి వెళ్లిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో జరిగింది. హైదరాబాద్​ అమీర్​పేట, ఎస్సార్​ నగర్​లో ఉంటున్న వెంకటరమణ, రామకృష్ణ, బుజ్జి అనే ముగ్గురు వ్యక్తులు తమకు ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ బిజినెస్​, సినిమా డైరెక్టర్​, నిర్మాతగా ఉన్నామని చెప్పి మహిళలకు మాయమాటలు చెప్పి వేధించారని కుషాయిగూడ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు, యువతులకు ఉద్యోగం ఇప్పిస్తామని.. రోజూ రూ. 2 నుంచి 10 వేల వరకు సంపాదించవచ్చని నమ్మబలికారని పోలీసులు తెలిపారు. బాధితులకు నిందితులు రాత్రి వేళల్లో ఫోను చేసి.. తాము చెప్పిన చోటుకు రావాలని చెప్పి ఇబ్బందులు పెట్టారని పోలీసుల విచారణలో తేలినట్లు వెల్లడించారు. బుధవారం ఇద్దరిని అరెస్ట్​ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వివరించారు.

ఇదీ చదవండి: ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్‌ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.