మినీ బ్యాంక్‌కు సంఘాలకు మధ్య వారధిగా ఉండే మహిళ, వారికి సహకరించిన సీసీ అవినీతి నుంచి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ ఎస్పీని పొదుపు సంఘం మహిళలు కలిశారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం తుర్కపల్లి గ్రామంలో సహాయక సంఘాల పొదుపు, అప్పు వాయిదా చెల్లింపుల్లో భారీ అక్రమాలు జరిగాయని వాపోయారు. సుమారు రూ.కోటికి పైగా అవినీతికి పాల్పడ్డారని తెలిపారు.
దాదాపుగా 500 మంది మహిళలు 34 స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి పొదుపు చేసుకున్న మొత్తాలను, ప్రభుత్వం అందించే రుణాలను పొంది... వాయిదా పద్ధతుల్లో చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేస్తామని బాధితులకు ఎస్పీ హామీ ఇచ్చారు. విచారణ జరిపి... వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: పాతబస్తీలో జరిగిన బరాత్‌లో కత్తులు, తుపాకీ కలకలం