ETV Bharat / jagte-raho

ఆకతాయిల చేష్టలకు పచ్చని చెట్లు ఆహుతి - ఆకతాయిల చేష్టలకు పచ్చని చెట్లు మంటలకు ఆహుతి

అడవిలో చలిమంట అని వేసుకున్నారు. చలి కాచుకున్నాక ఆ మంటలను ఆర్పకుండా వెళ్లిపోయారు. ఈ ఆకతాయి చేష్టలకు ఎండిన గడ్డే గాక పచ్చని చెట్లూ కాలి బూడిదయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 50 ఎకరాల్లో వేల చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. వికారాబాద్​ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 'ఈటీవీ భారత్'​ అందించిన సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది మంటలు అదుపు చేసే చర్యలు తీసుకున్నారు.

trees burnt in vikarabad forest area
ఆకతాయిల చేష్టలకు పచ్చని చెట్లు మంటలకు ఆహుతి
author img

By

Published : Dec 25, 2020, 7:58 PM IST

చలి మంట కోసం వేసుకున్న అగ్గి.. పచ్చని చెట్లను కాలి బూడిద చేసింది. వికారాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో ఆకతాయిలు మంట వేసి ఆర్పకుండా పోవడంతో... సుమారు 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని పచ్చని చెట్లు కాలి బుడిదయ్యాయి. జిల్లా కేంద్రంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం వెనుక భాగం కొండపై మధ్యాహ్నం 12 గంటల సమయంలో మంటలు మొదలయ్యాయి. అవి క్రమంగా గుట్ట మొత్తం అల్లుకున్నాయి. మరోవైపు దేవాలయం నుంచి కేరెల్లి గ్రామం వెళ్లే రహదారిలో కొండ వాలుపై సుమారు 100 ఎకరాలకు పైగా మంటలు అల్లుకున్నాయి.

మంటలకు కాలిపోతోన్న గడ్డి

పక్షుల ఆర్తనాదాలు

అటవీ ప్రాంతంలోని చెట్లు, గడ్డి, పొదల్లో గూళ్లు కట్టుకున్న పక్షులు మంటల ధాటికి విలవిల్లాడాయి.

ఈటీవీ భారత్​ సమాచారంతో

విషయం తెలుసుకున్న 'ఈటీవీ భారత్'​ విలేకరి.. జిల్లా అటవీశాఖ అధికారికి సమాచారం అందించారు. స్పందించిన అధికారి.. సిబ్బందిని పంపి మంటలను అదుపు చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: అనుమానస్పద స్థితిలో మృతదేహం లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.