ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పులి వరుస దాడులు... స్థానికులను బెంబేలెత్తిస్తోంది. రెండు రోజుల కిందట పిప్పలకోటి శివారులో పశువును హతమార్చిన పులి... తాజాగా తాంసి(కె) శివారులో మరో పశువును చంపడం కలకలం రేపుతోంది.
పక్షం రోజుల కిందట తాంసి, అంతర్గావ్, కరంజి అటవీ శివారులో పులి వరుస దాడులు పరిసర గ్రామస్థులను నిద్ర లేకుండా చేసాయి. తాజాగా మళ్లీ వరుస దాడులు.. స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు ప్రజలు అటవీ ప్రాంతం వైపు రావద్దని కోరుతున్నారు.
- ఇదీ చూడండి: ఆ ఊర్లో భయం..భయం.. పులి దాడిలో పశువు హతం..