జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. వెంచరామి శివారులో తాడిచర్లకు వెళ్లే బండ్ల బాటలో పెద్దపులి పాదముద్రలను స్థానికులు గమనించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. జిల్లా ఫారెస్ట్ అధికారి పురుషోత్తంతో పాటు రేంజ్ ఆఫీసర్లు, ఇతర అధికారులు కలిసి పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలించారు.
కాగా... శనివారం తెల్లవారుజామున ఓడేడు గ్రామానికి చెందిన రైతులు పూరేడు గుట్ట వద్ద ఉన్న వరి పొలాలకు వెళ్తుండగా పెద్దపులితో పాటు మరో చిన్నపులిని గమనించారు. భయబ్రాంతులకు గురైన రైతులు గ్రామానికి పరుగులు తీశారు.