ETV Bharat / jagte-raho

ఘర్షణకు దారి తీసిన భూవివాదం - three injured in land dispute in narayankhed

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో భూవివాదంతో ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం కత్తులతో దాడి చేసుకునే వరకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

three persons injured in land dispute in sangareddy
ఘర్షణకు దారి తీసిన భూవివాదం
author img

By

Published : May 14, 2020, 9:31 AM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో భూవివాదంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి కత్తిపోటుకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి.

నారాయణఖేడ్ మండలం తుర్కపల్లికి చెందిన ప్రవీణ్, అదే తండాకు చెందిన మారుతీ నాయక్ వ్యవసాయ భూములు పక్క పక్కన ఉన్నాయి. వీరిరువురి మధ్య భూములు దున్నే విషయంలో వాగ్వాదం చెలరేగింది.

వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ గొడవలో మారుతీ నాయక్​ కత్తి పోటుకు గురికాగా, ప్రవీణ్, అతని సోదరునికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.