ఏపీలోని అనంతపురం జిల్లా సుబ్బరాయ నగర్‌కు చెందిన మాధవి తన మూడు నెలల బాలికను.. ఆస్పత్రికి తీసుకెళ్లి కాలినడకన వస్తుండగా, గుర్తు తెలియని దుండగులు చిన్నారిని అపహరించారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు.. తల్లి మాధవిపై మత్తుమందు చల్లి పసిపాపను లాక్కెళ్లారు. స్థానికులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో.. రేగాటిపల్లి రహదారి పక్కన ముళ్లపొదల్లో పసిబిడ్డను వదిలివెళ్లారు. చికిత్స నిమిత్తం చిన్నారిని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పిల్లలను ఎత్తుకెళ్లేవారు చిన్నారిని అపహరించి వదిలిపెట్టారా? లేక మరేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాధవి తల్లి నాగేంద్రమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ చేతుల మీదుగా చిన్నారిని తల్లికి అప్పగించారు.
ఇదీ చదవండి: 'ఏవీ సుబ్బారెడ్డి ఏ1, అఖిలప్రియ ఏ2, ఆమె భర్త ఏ3'