భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పీఎస్ పరిధి చెన్నాపురం అడవుల్లో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులున్నారు.
ఘటనాస్థలంలో 8 ఎంఎం రైఫిల్, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.