గ్యాంగ్స్టర్ నయీం అనుచరులమని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొరికిన చరవాణి ద్వారా భాస్కర్ అనే వ్యక్తికి ఫోన్ చేసి నయీం తమ్ముడినంటూ పరిచయం చేసుకుని డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు.
బాధితుడు బీబీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... యాదగిరిగుట్టకు చెందిన నవీన్, గణేశ్లుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు. ఎవరికైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు.