మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధిలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. సంస్కృతి టౌన్షిప్లలో వారం రోజుల వ్యవధిలోనే నాలుగు ఇళ్లను దోచేశారు.
లక్షల రూపాయలు మెయింటెనెన్స్ రూపంలో వసూల్ చేస్తున్న అసోసియేషన్ సభ్యులు.. భద్రతను ఏమాత్రం పట్టించుకోవడం లేదని టౌన్షిప్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీకెమెరాలున్నా.. కొన్ని సరిగ్గా పనిచేయడం లేదని తెలిపారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు టౌన్షిప్ ప్రహరీని కూల్చివేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
దోపిడీ దొంగలు చోరీలు, హత్యలకు పాల్పడక ముందే సంబంధిత అధికారులు టౌన్షిప్ భద్రతపై దృష్టి సారించాలని కోరారు.
- ఇదీ చూడండి : మీసేవ కేంద్రంలో అగ్నిప్రమాదం.. 5 లక్షల ఆస్తినష్టం