ETV Bharat / jagte-raho

బెదిరించి నగలు కాజేసిన ఆటో డ్రైవర్​కు రిమాండ్​

author img

By

Published : Oct 29, 2020, 10:45 PM IST

ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధ దంపతులను బెదిరించి నగలు కాజేసిన ఆటో డ్రైవర్​ను పట్టుకుని రిమాండకు తరలించినట్టు భువనగిరి జోన్ డీసీపీ కే నారాయణ రెడ్డి తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.

thief arrested at bhuvanagirir in yadadri bhuvanagiri district
బెదిరించి నగలు కాజేసిన ఆటో డ్రైవర్​కు రిమాండ్​

ఉత్తరప్రదేశ్​కు చెందిన మహమ్మద్ సాహెలీజ్ అలియాస్ దిల్లీ అనే వ్యక్తి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భువనగిరి బస్టాండ్ వద్ద వృద్ధ దంపతులు బీబీనగర్​కు వెళ్లాలని ఆటో డ్రైవర్ దిల్లీని కోరగా... ఆటో ఎక్కించుకుని భువనగిరి బైపాస్ వైపు తీసుకెళ్లి వారిని బెదిరించాడు. వారి వద్ద ఉన్న నెక్లెస్, కమ్మలు లాక్కొని పక్కనే ఉన్న ఓ దాబా వద్ద దింపి వెళ్లాడు.

బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు... ఆటో డ్రైవర్​ని జలీల్​పురా వద్ద గుర్తించి అతని నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు. దిల్లీ అనే వ్యక్తి గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని వివరించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించామని వెల్లడించారు.

ఇదీ చదవండి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.