ETV Bharat / jagte-raho

సహకార సంఘం ఛైర్మన్ ఇంట్లో చోరీ.. రెండున్నర తులాల బంగారం అపహరణ - ఆత్మకూర్ తాజా వార్తలు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ ఇంట్లో చోరీ జరిగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.

Theft at the home of the chairman of the Primary Agricultural Cooperative Society in yadadri bhuvanagiri district
సహకార సంఘం ఛైర్మన్ ఇంట్లో చోరీ
author img

By

Published : Nov 8, 2020, 10:22 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ శేఖర్ రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. ఛైర్మన్ ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్న తన అన్న రాజిరెడ్డి ఇంట్లో నిర్వహించిన శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం ఇంటికి తాళం వేసి వెళ్లారు. సాయంత్రం వచ్చేసరికి ఆగంతుకులు తాళాలు పగులగొట్టి గదిలోని బీరువాలో దాచిన రెండున్నర తులాల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలు, రూ.50 వేల నగదు, మూడు రోజుల క్రితం రూ.10 వేలతో కొనుగోలు చేసిన చరవాణి దోచుకెళ్లారు.

దొంగలను గుర్తించేందుకు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను ఎస్సై ఎండీ.ఇద్రిస్ అలీ పరిశీలిస్తున్నారు. క్లూస్ టీంతో ఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. ఛైర్మన్​ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇద్రీస్అలీ తెలిపారు.

ఇదీ చదవండి: గల్ఫ్​లో నిర్మల్​ జిల్లా వాసి మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.