ETV Bharat / jagte-raho

ఇంట్లో మందు పార్టీ చేశారు.. ఆ ఇల్లునే గుల్ల చేశారు.!

అర్ధరాత్రి ఇంట్లో చొరబడ్డారు. అందినకాడికి దోచుకున్నారు. అనంతరం ఇంట్లోనే కూర్చుని తాపీగా మందు కొట్టారు. సగం తాగిన మద్యం బాటిల్‌ను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

theft at srt colony in musheerabad ps limits
ఇల్లును గుళ్ల చేశారు.. మద్యం వదిలేశారు..!
author img

By

Published : Dec 24, 2020, 5:24 PM IST

ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి రామ్‌నగర్‌లోని ఎస్‌ఆర్‌టీ కాలనీలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో పాండు అనే వ్యక్తి ఇంట్లో చొరబడిన దుండగులు సుమారు 7 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి వస్తువులతో పాటు నగదు అపహరించారు.

స్థానికంగా ఉన్న ఓ భవనంలో అద్దెకుంటున్న పాండు.. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు. అతని కుమారుడు బుధవారం రాత్రి ఇంటికి తాళం వేసి.. భవన యజమానికి తాము బయటకు వెళుతున్నట్లు చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో పాండు ఇంట్లోకి చొరబడిన దుండగులు.. బీరువాను పగులగొట్టి సుమారు 7 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి వస్తువులతో పాటు రూ.30 వేల నగదు, దేవుడి హుండీలో ఉన్న మరికొంత నగదు ఎత్తుకెళ్లారు.

ఈ మేరకు పాండు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. బీరువా ముందు సగం తాగి ఉన్న మద్యం బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. చోరీ అనంతరం దొంగలు మద్యం సేవించి ఉంటారని భావిస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఇదీ చూడండి: విమానాశ్రయంలో సిల్వర్ కోటింగ్ బంగారు తీగల పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.