మేడ్చల్ జిల్లా ఎల్లమ్మబండలో మహమ్మద్ అన్సార్ అహ్మద్ (40) తన భార్య చాంద్ బీతో కలిసి నివాసముంటున్నాడు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. వీరి ఇంటి పక్కనే ఉన్న ఇమ్రాన్.. చాంద్ బీతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. విషయం తెలుసుకున్న చాంద్ బీ భర్త.. ఇమ్రాన్‌ను మందలించాడు. అహ్మద్‌పై కక్ష పెంచుకున్నాడు ఇమ్రాన్. అహ్మద్‌పై దాడి చేసి కళ్లలో కారం చల్లి కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేశాడు. నిందితుడు ఇమ్రాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: యువతి అనుమానస్పద మృతి.. ఫొటోలే కారణమా?