కామారెడ్డిలో రెండోరోజూ ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పట్టణ సీఐ జగదీశ్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి 11 వరకు సాగాయి. బెట్టింగ్ కేసులో ఓ వ్యక్తిని బెయిలు మీద విడుదల చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు రావడం వల్ల ఏసీబీ సోదాలు చేపట్టింది.
నిన్న రాత్రి తనిఖీలు పూర్తయిన తర్వాత సీఐ జగదీశ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి కొవిడ్, సాధారణ వైద్య పరీక్షల కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. మొదటి రోజు పలు దస్త్రాలు, ఇతర ఆధారాలు లభించడంతో వరుసగా రెండో రోజు సీఐ జగదీష్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
- ఇదీ చూడండి: హైదరాబాద్‌లో 20 లక్షల హవాలా డబ్బు స్వాధీనం