వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరులేని సమయంలో పదమూడేళ్ల బాలికపై తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. నిస్సహయ స్థితిలో ఆ బాలిక ఎవరికి చెప్పుకోలేక పోయింది. కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి మరోసారి బాలికపై అత్యాచారానికి యత్నించాడు. విషయాన్ని బాలిక తన నానమ్మ చెప్పి విలపించింది.
కొడుకు ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కరన్‌కోట్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో విచారణ జరిపిన అనంతరం కీచక తండ్రిని అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి: ఆపరేషన్ హస్తం: కర్ణాటకలో ఏం జరుగుతోంది?