ETV Bharat / jagte-raho

ఆఫీసు పైనుంచి దూకి ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య - woman suicide in gopalapuram

రోజులాగే ఆఫీసుకెళ్లింది. అంతలోనే ఏమైందో.. తెలియదు ఆఫీసు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం హైదరాబాద్​లో చోటుచేసుకుంది. యువతి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.

టెక్​ మహీంద్రా కార్యాలయ భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
tech mahindra employee suicide
author img

By

Published : Nov 19, 2020, 1:47 PM IST

Updated : Nov 19, 2020, 1:57 PM IST

హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సికింద్రాబాద్‌ గోపాల్‌పురం పరిధిలోని తన కార్యాలయ భవనంపై నుంచి దూకి సుష్మిత (21) అనే యువతి ఆత్మహత్య చేసుకున్నారు.

నగరంలోని నామాలగుండుకు చెందిన సుష్మిత టెక్‌మహీంద్ర సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఇవాళ ఉదయం విధులకు హాజరైన యువతి తన కార్యాలయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఆఫీసు పైనుంచి దూకి ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య

Last Updated : Nov 19, 2020, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.