హైదరాబాద్ పాతబస్తీ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి ప్రాంతంలో అక్రమంగా జర్దా తయారు చేస్తున్న స్థావరంపై మధ్య మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిందితుడు సోహైల్‌ను అరెస్ట్ చేశారు. దాదాపు 3 లక్షల విలువ చేసే 100 కిలోల జర్దా, 5000 వేల ఖాళీ జర్దా డబ్బాలు, 2 తూకం యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు సులువుగా డబ్బు సంపాదన కొరకు బయట నుంచి జర్దాను తీసుకొచ్చి వేరు వేరు పేర్లతో అక్రమంగా తయారు చేసి పాన్ షాపులు, దుకాణాల్లో అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకుతో నిందితున్ని తదుపరి విచారణ నిమిత్తం ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించారు.