ETV Bharat / jagte-raho

ఎక్సైజ్ కానిస్టేబుల్​పై దాడికి దిగిన తండా వాసులు - Nagarkurnool district news

నాగర్​కర్నూల్​ జిల్లా కోడేరు మండలం నార్యనాయక్ తండాలో ఓ ఎక్సైజ్ హెడ్​కానిస్టేబుల్​పై తండా వాసులు దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన తలకు గాయమైంది. ఫలితంగా తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎక్సైజ్ కానిస్టేబుల్​పై దాడికి దిగిన తండా వాసులు

author img

By

Published : Jan 12, 2021, 8:52 PM IST

ఎక్సైజ్ అధికారుల తనిఖీలను అడ్డుకుని ఓ కానిస్టేబుల్​పై దాడి చేసిన ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కోడేరు మండలం నార్యనాయక్ తండాలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. బతుకు దెరువు చూపకుండా తమ జీవనోపాధిపై దాడి చేయడం పద్ధతి కాదంటూ గిరిజనులు ఎక్సైజ్ అధికారులపై తిరగబడ్డారు.

వాహనాలకు అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ హెడ్​కానిస్టేబుల్ శంకర్ నాయక్​పై దాడి చేయగా... ఆయన తలకు గాయమైంది. అనంతరం నార్యా నాయక్ తండా, ఎంగంపల్లి తండా గిరిజనులు ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొంతసేపు కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ఎక్సైజ్ అధికారులు తండాలలో దాడులు ఆపాలంటూ కార్యాలయం ముందు కూర్చొని ఆందోళన చేశారు. తమకు జీవనోపాధి చూపి దాడులను నిర్వహించాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఎక్సైజ్ కానిస్టేబుల్ శంకర్ నాయక్ పై దాడి చేసిన ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. స్టేషన్ బెయిల్​తో అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేశారు.

ఇదీ చూడండి: దేశ రైతులు సాధించిన పాక్షిక విజయం: నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.