పెద్దపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో రంజాన్ అనే రైల్వే ఉద్యోగి అనుమానాస్పదంగా మంగళవారం రాత్రి మృత్యువాతపడ్డాడు. స్టేషన్ పనులు ముగించుకుని సాయంత్రం హోటల్లో సేదతీరేందుకు వచ్చాడు. వెంట తెచ్చుకున్న మాత్రను వేసుకుని మంచినీళ్లు తాగి కొద్దేసేపు అక్కడే కూర్చున్నాడు.
స్థానికులు గమనించి ఎంతలేపినా... లేవకపోవడంతో మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి స్వస్థలం మహబూబాబాద్ కాగా.. కొన్ని రోజులుగా పెద్దపల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు తోటి ఉద్యోగులు తెలిపారు.
ఇదీ చదవండి: నమ్మి భూములిస్తే... నట్టేట ముంచుతారా?