ETV Bharat / jagte-raho

కరోనా సోకిందనే అనుమానంతో ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Apr 27, 2020, 1:33 PM IST

కరోనా సోకిందనే అనుమానంతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Suicide attempt on suspicion of corona infection in suryapeta district
కరోనా సోకిందనే అనుమానంతో ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్​) మండలం ఏపూరు గ్రామంలో కరోనా సోకిందనే అనుమానంతో సుగుణమ్మ అనే మహిళ ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు.

గ్రామానికి చెందిన తడకపల్లి సుగుణమ్మ ఈనెల 9న అదే గ్రామానికి చెందిన తమ బంధువు ఇంటికి వెళ్లి వచ్చింది. ఈనెల 10న సుగుణమ్మ బంధువు పక్కింటి వారికి కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో సుగుణమ్మ బంధువులను సైతం క్వారంటైన్​కు తరలించారు. ఈనెల 21న వారికీ కరోనా సోకినట్లు తేలింది.

దీనికి తోడు 2 రోజుల నుంచి సుగుణమ్మకు జ్వరంగా ఉండడం వల్ల తనకూ కరోనా సోకిందేమోనన్న భయంతో ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోని దూలానికి ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు సుగుణమ్మను కాపాడారు. సృహతప్పిన ఆమెను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కరోనా ప్రాథమిక లక్షణాలు ఏమీలేవని చెప్పిన వైద్యులు.. ఆమెను ఇంటికి పంపించారు.

ఇదీ చూడండి: వలస కూలీల సమస్యలను తీర్చిన రాచకొండ సీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.