ETV Bharat / jagte-raho

నేను డాక్టర్​ అవుతాను నాన్నా! అని చెప్పిన కూతురు.. చివరకు.. - student suicide in sangem

డాక్టర్ కావాలని కూతురు కన్న కలను నెరవేర్చే స్తోమత ఆ తండ్రికి లేకపోయినా.. ఎంత కష్టమైనా చదివిస్తానని మాటిచ్చాడు. ఆరోజు నుంచి తన కుమార్తెను డాక్టర్​ను చేయడానికి ఆ తండ్రి పడని కష్టం లేదు. తీరా పరీక్ష రాశాక సీటు రాలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన కన్నకూతురు తన కళ్ల ముందే జీవచ్ఛవంలా మారడం చూసి ఆ తండ్రి గుండె ముక్కలయింది.

student committed suicide at Ramachandrapuram
రామచంద్రాపురంలో యువతి ఆత్మహత్య
author img

By

Published : Oct 29, 2020, 1:22 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురానికి చెందిన తేజస్విని ఇటీవల నీట్ పరీక్ష రాసింది. మంచి ర్యాంక్ వస్తుందని, పరీక్ష బాగా రాశానని ఇంట్లో వాళ్లకు ఎంతో ఆనందంగా చెప్పింది. తీరా ఫలితాల్లో ఆశించిన ర్యాంక్ రాలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన తేజస్విని ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.

నేను డాక్టర్ అవుతా నాన్నా.. అని చెప్పిన కూతురు కళ్లముందే విగత జీవిగా మారడం చూసిన ఆ తండ్రి గుండె బద్ధలయింది. కన్నకూతురి మరణం ఆ తల్లిదండ్రులను తీరని శోకంలోకి నెట్టేసింది. తేజస్విని మరణంతో రామచంద్రాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.