ETV Bharat / jagte-raho

రూ.లక్షలు కొట్టేశారు.. కాగితపు ముక్కతో చిక్కారు! - guntur newsupdates

ఏపీలోని.. నడికుడి స్టేట్ బ్యాంక్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడ ఎస్​టీ కాలనీకి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సినిమాలు చూసి ఈ దొంగతనానికి పాల్పడిన దొంగలు... ఓ చిన్న కాగితపు ముక్కను క్లూగా వదిలేశారు. అదే వారిని సులువుగా దొరికిపోయేలా చేసింది.

state-bank-theft-history-at-dachepally-guntur-district
రూ.లక్షలు కొట్టేశారు.. కాగితపు ముక్కతో చిక్కారు!
author img

By

Published : Nov 27, 2020, 5:07 PM IST

చోరీలు చేయడంలో ఎంతటి సిద్ధహస్తులైనా నేర ప్రదేశంలో ఏదో ఒక క్లూ విడిచిపెడతారనేది నానుడి. ఏపీ రాష్ట్రంలో సంచలనం కలిగించిన నడికూడి ఎస్‌బీఐ చోరీ కేసు విషయంలో అదే జరిగింది. బ్యాంకులో ఎలా దొంగతనం చేయాలనే దానిపై జులాయి సినిమా చేశారు.. ఎక్కడ ఒక్క ఆధారం దొరక్కుండా చేతికి గ్లౌజులు వేసుకోవడం, సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం, పోలీసు జాగిలాలు వాసన పసికట్టకుండా కారం పొడి చల్లడం.. చేసి బ్యాంకులో రూ.77 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈక్రమంలో జేబులో నుంచి జారిన ఒక కాగితం ముక్క వారిని సులువుగా పట్టించింది. స్టేట్‌బ్యాంకు దొంగతనం కేసును ఐదు రోజుల్లోనే చేధించడమే గాక నగదు మొత్తాన్ని పోలీసులు రికవరీ చేశారు.

ఏపీలోని.. దాచేపల్లి పరిధిలోని నడికూడి ఎస్‌బీఐలో ఈనెల 21న చోరీ జరిగిన సంగతి విదితమే. రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ చోరీ జరిగిన రోజే బ్యాంకును పరిశీలించి ఎలా దర్యాప్తు జరపాలో దిశా, నిర్దేశం చేశారు. పోలీసులకు దర్యాప్తు సులువైంది. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడేనికి చెందిన ఇద్దరు యువకులు ఆ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారు చిల్లర దొంగతనాలకు పాల్పడిన నేపథ్యం ఉంది తప్పిస్తే, ఇంత భారీ స్థాయిలో నగదు ఎత్తుకెళ్లిన ఉదంతాలు లేవని పోలీసులు తెలుసుకున్నారు. పందుల పెంపకందారుల కుటుంబానికి చెందిన ఈ యువకులు అడపాదడపా దాచేపల్లి వచ్చి పోతుంటారని సమాచారం. వీరు సినిమాలు చూసి బ్యాంకు చోరీలకు పాల్పడటం తెలుసుకుని ఆమేరకు నడికుడి బ్యాంకు చోరీకి పాల్పడ్డారని పోలీసుల విచారణలో బయటపడినట్లు తెలిసింది. వీరు రెండు మాసాల నుంచి దాచేపల్లికి వచ్చిపోతూ బ్యాంకు పరిసరాలు పరిశీలించుకోవడం, చోరీ అనంతరం చేజిక్కించుకున్న నగదును ఎక్కడ పెట్టాలి? దాన్ని ఎలా తీసుకెళ్లాలో కూడా రెక్కీ చేసుకుని వెళ్లారని తెలిసింది.

వారిద్దరూ.. మిర్యాలగూడెం వాసులు

బ్యాంకులో వీరికి అత్యధికంగా రూ.వందల కట్టలతో కూడిన నగదు లభ్యమైంది. ఆ మొత్తాన్ని వారు బ్యాంకులో నుంచి బయటకు తీసుకొచ్చారు. బ్యాంకులో ఈ కట్టలు తీసుకుని బ్యాగ్‌లో నింపుకునే సమయంలో ఓ నిందితుడి జేబులో రాసి పెట్టుకున్న చరవాణి నంబరు స్లిప్‌ అక్కడ చేజారింది. దాన్ని వారు గుర్తించలేదు. ఇది పోలీసుల కంట పడటం ఆ విషయం ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్పీ విశాల్‌గున్నీ వెంటనే ఆ ఫోన్‌ నంబర్‌కు డయల్‌ చేయకుండా ఆ ఫోన్‌ నంబరు ఎక్కడిది? వారు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలుసుకుని ఆ ప్రాంతానికి చేరుకుని వారిని పట్టుకోవాలని ఆదేశించారు. కాల్‌ జాబితాలో ఆ చరవాణి నంబరు కలిగిన యువకుడిది మిర్యాలగూడెం ఎస్టీ కాలనీకి చెందినదని రావడంతో వెంటనే అక్కడకు ఓ పోలీసు బృందాన్ని పంపారు. నేరుగా ఆ కాలనీకి చేరుకొని విచారించగా వారి బంధువులు ఆ యువకుడి సమాచారం చెప్పడం, పోలీసులు వెళ్లినప్పుడు ఆ యువకుడు స్ధానికంగా ఉండటంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన మరో దొంగ సమాచారం తెలియజేసినా ఆ యువకుడికి అప్పటికే పోలీసులు పట్టుకోవడానికి వేటాడుతున్నట్లు తెలుసుకుని రెండు రోజుల పాటు అందుబాటులోకి రాలేదు. చివరకు పోలీసుల అదుపులోనున్న ఆ యువకుడి ద్వారానే రెండో వ్యక్తికి ఫోన్‌ చేయించి అతన్ని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తారని సమాచారం.

బ్యాంకులో డబ్బును గోతాల్లో నింపుకొని బయటకు వచ్చారు. ఒక్కసారిగా భారీ నగదును చూసిన వారు ఆందోళనకులోనై కొంత మొత్తాన్ని దాచిపెట్టాలని భావించారు. బ్యాంకు దాటిన తరువాత సర్వీసు రోడ్డులో నుంచి వస్తున్న వీరు స్థానికంగా సుబ్బమ్మ హోటల్‌ వెనుక భాగాన ఉన్న శ్మశానవాటిలో రూ.45 లక్షలున్న గోతం పడవేశారు. డబ్బులున్న మిగిలిన గోతం తీసుకొని రాష్ట్రీయ రహదారిపైకి చేరుకొని, లారీ ఎక్కి మిర్యాలగూడెం వరకు వెళ్లినట్లు సమాచారం. పోలీసులు గుర్తించకపోతే వారం రోజుల తరువాత వచ్చి ఆ డబ్బులు తీసుకెళదామనేది వీరి ప్రణాళిక. శ్మశానవాటికలో పోలీసులు వెతికారు. అయితే ఆ డబ్బు మాత్రం ఎవరి కంట పడలేదు. నాలుగు రోజుల పాటు డబ్బు అక్కడే ఉండిపోయినట్లు తేలింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.