ETV Bharat / jagte-raho

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మందుపాతరల కలకలం.. - andhra odisha border latest news

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో మందుపాతరలు కలకలం రేపాయి. పోలీసు బ‌ల‌గాల‌ను చంపాల‌నే ఉద్దేశ్యంతో మందుపాత‌ర‌ను పెట్టాలన్న మావోయిస్టుల కుట్ర‌ను ఏపీ విశాఖ జిల్లా చింత‌ప‌ల్లి పోలీసులు భ‌గ్నం చేశారు. అయితే పోలీసులు మాటువేసి అటువైపుగా వ‌చ్చిన కోరుకొండ మావోయిస్టు మిలీషియా బృందాన్ని పట్టుకున్నారు. ఎన్నో నెలలుగా పోలీసుల‌కు చిక్క‌కుండా తిరుగుతున్న కోడా కృష్ణారావును అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగ‌ర నాయుడు తెలిపారు.

special-party-police-seized-landmines-in-aob
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మందుపాతరల కలకలం..
author img

By

Published : Oct 21, 2020, 8:54 AM IST

పోలీసు బ‌ల‌గాల‌ను చంపాల‌నే ఉద్దేశ్యంతో మందుపాత‌ర‌ను పెట్టాల‌న్న మావోయిస్టుల కుట్ర‌ను ఏపీ విశాఖ జిల్లా చింత‌ప‌ల్లి పోలీసులు భ‌గ్నం చేశారు. పోలీసు ఉన్న‌తాధికారుల‌కు ముంద‌స్తుగా వ‌చ్చిన స‌మాచారంతో మాటువేసి అటువైపుగా వ‌చ్చిన కోరుకొండ మావోయిస్టు మిలీషియా బృందాన్ని పట్టుకున్నారు. ఇందులో కొంత‌మంది మిలీషియా సభ్యులు త‌ప్పించుకోగా ఎన్నో నెలలుగా పోలీసుల‌కు చిక్క‌కుండా తిరుగుతున్న కోడా కృష్ణారావును పోలీసులు ప‌ట్టుకున్నారు.

చింత‌ప‌ల్లి మండ‌లం ల‌బ‌డంప‌ల్లి గ్రామానికి చెందిన కృష్ణారావుతో పాటు బొనంగి నాగేశ్వ‌ర‌రావు, బొండా ప్ర‌సాదు త‌దిత‌రులు... గుత్తేదారులు వ‌ద్ద బ‌ల‌వంత‌పు వ‌సూళ్లు చేస్తూ మావోయిస్ట‌ులకు స‌హ‌క‌రిస్తున్నార‌ని పోలీసులు తెలిపారు. కృష్ణారావు వద్ద నుంచి ఒక మందుపాత‌ర‌, రెండు డిటోనేట‌ర్లు, 50 మీట‌ర్లు వైరు, బ్యాట‌రీలతో పాటు విప్ల‌వ‌సాహిత్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించామ‌ని చింత‌ప‌ల్లి ఏఎస్పీ విద్యాసాగ‌ర నాయుడు తెలిపారు.

ఇదీ చదవండి: సచివాలయ భవన నిర్మాణానికి రెండే టెండర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.