హైదరాబాద్ ఎస్‌ఆర్‌నగర్ పరిధిలోని బల్కంపేటలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తన తల్లినే కత్తితో పొడిచి చంపాడు ఓ కుమారుడు. కర్ణాటకకు చెందిన 57ఏళ్ల సంగీత బల్కంపేటలో కుమారుడు సంతోశ్(24)తో కలిసి నివాసముంటోంది. సంగీతకు ఓ కూతురు, ఇద్దరు కుమారులున్నారు. చిన్నకుమారుడైన సంతోశ్‌కు మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. చెడు అలవాట్లకు బానిసైన సంతోశ్‌ను తల్లి మందలించగా.. కోపంతో తల్లిని కత్తితో పొడిచి చంపేశాడని ఆరోపిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి.. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.