ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఎదురుమొండిలో దారుణం చోటుచేసుకుంది. కనిపెంచిన తల్లిదండ్రులపైనే గొడ్డలితో దాడి చేశాడు ఓ వ్యక్తి. ఘటనలో అతని తల్లి మరణించింది. గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, వీరలంకమ్మ దంపతులపై వారి కుమారుడు వీరరాఘవయ్య గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు.
వీరలంకమ్మ మృతి చెందగా... నాగేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. భార్యతో గొడవల కారణంగానే తల్లిదండ్రులపై కుమారుడు దాడి చేశాడని స్థానికులు చెబుతున్నారు. అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీ మృతి