ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం జలాశయంలో గల్లంతైన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వల్లూరి సుధాకర్ హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో సుధాకర్.. తన 18 మంది స్నేహితులతో కలిసి లక్నవరం వెళ్లాడు.
సరదాగా గడుపుతుండగా
జలాశయం పరిసర ప్రాంతాల్లో గడపాలని నిర్ణయించుకుని అందరూ కాటేజీలు బుక్ చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం జలాశయం కట్ట మెట్ల వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను వీక్షిస్తున్న సమయంలో సుధాకర్ ప్రమాదవశాత్తు నీళ్లలో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు రాత్రి 9 గంటలకు వరకు గాలించినా అతను దొరకలేదు. శనివారం ఉదయం ఈతగాళ్లు మళ్లీ గాలింపు చేపట్టడంతో సుధాకర్ మృతదేహం లభ్యమైంది.
ఇదీ చదవండి: మహిళ హత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు