ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ ట్రాన్స్ఫార్మర్కు చెందిన కేబుల్ వద్ద మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
విషయం తెలుసుకున్న ప్రాజెక్ట్ ఎస్ఈ నాగేశ్వరరావు, ఈఈ రమణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ప్రాజెక్ట్ పరిధిలో గల మాచ్‌ఖండ్, ఓనకడిల్లి, జోలపుట్ క్యాంపులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనంతరం అధికారుల చొరవతో విద్యుత్ పునరుద్ధరించారు.
ఇదీ చూడండి : నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష