హైదారాబాద్ జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అరుంధతినగర్లో 7 సంవత్సరాల బాలుడు నిఖిల్ గాలిపటం ఎగురవేస్తుండటంతో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. పతంగి కరెంటు తీగలను చుట్టుకున్న ఆ క్రమంలో దానిని తీసే క్రమంలో కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో బాలుడి తల, మొహం, ఛాతి కాలిపోయింది.
గమనించిన తల్లి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. తండ్రి రాజు 2 సంవత్సరాల క్రితం చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. బాలుని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరుకు కృతజ్ఞతగా యోధులపై పూలవర్షం