వికారాబాద్ జిల్లా కొడంగల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కొడంగల్ పట్టణంలో కొంతమంది వ్యాపారులు రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఐదు ప్రాంతాల్లో దాడులు చేసి సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ గిరిధర్ తెలిపారు. పలు వాహనాలను కూడా సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.
ఇవీ చూడండి: పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు మిలిషియా సభ్యులు