ETV Bharat / jagte-raho

అజ్ఞాతంలోకి అశోక్​రెడ్డి... పోలీసుల గాలింపు ముమ్మరం

శ్రావణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడి ఫోన్‌కాల్‌ డేటా ఆధారంతో వివరాలు సేకరిస్తున్నారు. బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్యకు ప్రేరేపించిన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్‌, సాయికృష్ణారెడ్డిని ఇదివరకే అరెస్టు చేశారు.

tv actress sravani suicide case
అజ్ఞాతంలోకి అశోక్​రెడ్డి... ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
author img

By

Published : Sep 16, 2020, 10:22 AM IST

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే దేవరాజ్, సాయికృష్ణా రెడ్డిని అరెస్టు చేశారు. ఏ2 గా ఉన్న సినీ నిర్మాత అశోక్​రెడ్డికి సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఎస్సార్​నగర్​ ఠాణాకు వస్తానని చెప్పి... చివరి నిమిషంలో మస్కా కొట్టాడు. సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు.

అవకాశాలు ఇస్తానంటూ..

సినీరంగంలో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆశ చూపి శ్రావణితో సంబంధం ఏర్పరచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఆమె దేవరాజ్‌కు దగ్గర కావటాన్ని అశోక్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తెచ్చి ఇద్దరూ విడిపోయేందుకు సహకరించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 7న అమీర్‌పేట హోటల్‌ వద్ద శ్రావణి, దేవరాజ్‌తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అశోక్‌రెడ్డి అందరూ కలసి శ్రావణిని శారీరకంగా హింసించారు.

కీలకంగా వ్యవహరించాడా?

ఆత్మహత్యకు ముందురోజు జరిగిన వ్యవహారంలో అశోక్‌రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. పసిగట్టిన దేవరాజ్‌, అశోక్‌రెడ్డి తప్పించుకునేందుకు పథకం వేశారు. దేవరాజ్‌ ఊరెళ్లినట్టు పోలీసులకు బురిడీ కొట్టించినట్టు విశ్వసనీయ సమాచారం. అశోక్‌రెడ్డి పేరు తెరమీదకు రాగానే సాయికృష్ణ ద్వారా దేవరాజ్‌ పేరు బయటకు తెచ్చారు.

ఆ 4 నెలల్లో ఏం జరిగింది..

దేవరాజ్‌ వేధిస్తున్నట్టు జూన్‌ 22న శ్రావణి ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మరుసటిరోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దేవరాజ్‌ను అరెస్ట్‌ చేయవద్దని కోరింది. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టుగా చెప్పింది. విషయం తెలిసిన సాయికృష్ణ, అశోక్‌రెడ్డి ఆమెపై మరింత ఒత్తిడి పెంచారు. సాయికృష్ణ, అశోక్‌రెడ్డి ఇద్దరూ పెళ్లి చేసుకుంటానంటూ తనను మోసగించారంటూ పలుమార్లు శ్రావణి స్నేహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఆ క్లిష్ట సమయంలో పరిచయమైన దేవరాజ్‌కు శ్రావణి చేరువైంది.

టిక్‌టాక్‌ బిందు ముందే హెచ్చరించినా...

దేవరాజ్‌ టిక్‌టాక్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని బారినపడి మోసపోయిన బిందు అనే యువతి.. దేవరాజ్‌ చేతిలో మోసపోవద్దంటూ సెల్ఫీ వీడియో ద్వారా శ్రావణిని హెచ్చరించింది.

ఇదీ చూడండి: ఆ ముగ్గురి వల్లనే... బుల్లితెర నటి శ్రావణి కేసు ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.