జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేటలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. చిట్యాల పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. నవాబుపేట్ వాగు వద్ద ఇసుక లోడుతో ఉన్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకటి నవాబుపేట్ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ శివరాత్రి అనిల్, మరోటి పప్పు శ్రీనివాస్‌కు చెందిందిగా గుర్తించారు.
ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా.. శివరాత్రి అనిల్, పప్పు శ్రీనివాస్‌లు పోలీస్ సిబ్బందిని అడ్డగించి, వారిని బెదిరించి ఇసుక ట్రాక్టర్లలను తీసుకెళ్లిపోయారు. ఈ మేరకు పోలీస్ సిబ్బంది విధులకు భంగం కలిగించిన ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి: కాంక్రీట్ వేస్తుండగా కూలిన స్లాబ్.. పది మందికి గాయాలు