ETV Bharat / jagte-raho

బస్సును ఢీకొట్టిన లారీ.. త్రుటిలో తప్పిన పెనుప్రమాదం - telangana crime news 2021

సూపర్​ లగ్జరీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టిన ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలం మామిళ్లగూడెం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

rtc bus accident at suryapet-khammam national highway
మామిళ్లగూడెం వద్ద సూపర్​ లగ్జరీని ఢీకొట్టిన లారీ
author img

By

Published : Jan 22, 2021, 5:53 PM IST

సూర్యాపేట జిల్లా మోతే మండలం మామిళ్లగూడెం వద్ద సూర్యాపేట-ఖమ్మం రహదారిపై సూపర్​ లగ్జరీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన బస్సు హైదరాబాద్​ నుంచి మధిరకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ప్రయాణికులంతా భయాందోళనకు గరయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో పది మంది మాత్రమే ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్ పోలీసులు ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.