ETV Bharat / jagte-raho

దొంగతనం చేసేందుకు పక్కింట్లో దూరాడు.. ఒళ్లు మెదిగింది..! - తెలంగాణ నేర వార్తలు

పక్కింటికి తాళం వేసి ఉండడమే అతను అదునుగా భావించాడు. అర్ధరాత్రి వేళ ఆ ఇంట్లో చొరబడ్డాడు. ఉన్న సొమ్మును కాజేశాడు. కట్​ చేస్తే సీన్ రివర్స్ అయింది. చివరకు దొంగ చిక్కాడు. స్థానికులంతా కలిసి చితకబాదారు.

rs-dot-7-lakhs-theft-at-padma-nagar-in-rajanna-sircilla-district
అర్ధరాత్రి అలా వెళ్లాడు... సొమ్ము దోచాడు... ఇలా చిక్కాడు!
author img

By

Published : Dec 30, 2020, 12:02 PM IST

రాజన్న సిరిసిల్లా జిల్లా సిరిసిల్ల పట్టణం పద్మానగర్​లో ఓ దొంగకు స్థానికులు దేహశుద్ది చేశారు. పద్మానగర్​లో నివాసముండే ఓ వ్యక్తి.. పక్క ఇంటికి తాళం వేసి ఉండడం గమనించాడు. అదే అదనుగా భావించిన ఆ వ్యక్తి అర్ధరాత్రి ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. వారు స్థలం కొనుగోలు కోసం దాచిన రూ.7 లక్షల నగదును కాజేశాడు. ఇంతలో ఇంటివారు రావడం గమనించిన దొంగ దోచిన సొమ్ముతో పారిపోతుండగా వారు కేకలు వేస్తూ వెంబడించారు.

ఆ ఇంట్లో వారు, స్థానికులు కలిసి వెంబడించగా.. ఎట్టకేలకు దొంగ వారి చేతికి చిక్కాడు. కాజేసిన సొమ్మును అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి: దారుణం: కుమారుడి దాడిలో తల్లి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.