ETV Bharat / jagte-raho

రాళ్ల గుట్టల మధ్య రౌడీషీటర్​ మృతదేహం.. - hyderabad crime news

పహాడి షరీఫ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని.. జల్​పల్లి చెరువు సమీపంలోని రాళ్ల గుట్టల మధ్య మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు రాజేంద్రనగర్​కు చెందిన రౌడీ షీటర్​ సయ్యద్​ వహేద్​ అలీదని తెలిపారు.

murder at pahadi sharif ps limits
రాళ్ల గుట్టల మధ్య రౌడీషీటర్​ మృతదేహం..
author img

By

Published : Oct 11, 2020, 10:07 PM IST

హైదరాబాద్​ నగర శివారు పహాడీ షరీఫ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. జల్​పల్లి చెరువు సమీపంలోని రాళ్ల గుట్టల మధ్య మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్లూస్​ టీంతో ఆధారాలు సేకరించారు.

మృతుడు రాజేంద్రనగర్​కు చెందిన రౌడీషీటర్​ సయ్యద్​ వహేద్​ అలీగా పోలీసులు గుర్తించారు. హత్యగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వనస్థలిపురం ఇంఛార్జీ ఏసీపీ ఎం.శంకర్​ ఘటనా స్థలిని పరిశీలించారు. రాళ్ల గుట్టల దగ్గరకు తీసుకొచ్చి హత్యచేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని ఇంఛార్జీ ఏసీపీ శంకర్​ తెలిపారు.

రాళ్ల గుట్టల మధ్య రౌడీషీటర్​ మృతదేహం..

ఇవీచూడండి: పొలం వద్దే చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.