నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి అటవీ ప్రాంతంలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తిగా కుళ్లిపోయి.. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు లభించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
కుళ్లిపోయిన మృతదేహాల్లో ఒకటి మహిళదిగా, మరొకటి పురుషుడిదిగా గుర్తించారు. ఘటనాస్థలం వద్ద పురుగుల మందు డబ్బాను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండిః చైనా బెట్టింగ్ కుంభకోణంలో దర్యాప్తు వేగవంతం