నల్గొండ జిల్లా వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం స్టేజీ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. అద్దంకి-నార్కట్ పల్లి రోడ్డు దాటుతున్న తిరుపతమ్మ అనే మహిళను అతివేగంతో ఓ బొలెరో వాహనం ఢీకొట్టింది. ఘటనలో తిరుపతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు తిరుపతమ్మకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు.