ETV Bharat / jagte-raho

పండుగ మిగిల్చిన విషాదం... రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - సిద్దిపేట నేర వార్తలు తాజా వార్త

దసరా రోజు ఓ ఇంట్లో తీరని విషాదం నెలకొంది. పండగకు కొత్త దుస్తులు తీసుకోవడానికి వెళ్తున్న ఓ ద్విచక్రవాహనదారుని ఎదురుగా వస్తున్న మరో బైక్​ ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

road accident in siddipet district  one person death
పండుగ మిగిల్చిన విషాదం... రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Oct 25, 2020, 9:38 PM IST

సంతోషంగా పండుగ జరుపుకుందాం అనుకున్న సమయంలో ఆ కుటుంబంలో పిడుగులాంటి వార్త తీరని విషాదాన్ని నింపింది. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన గుర్రం కరుణాకర్.. పండగకు దర్జీ వద్ద కుట్టించుకున్న కొత్త దుస్తులను తీసుకువస్తానని ఇంట్లో చెప్పి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. జగదేవ్​పూర్ సమీపంలో రాగానే ఎదురుగా వస్తున్న మరో బైకు ఎదురెదురుగా ఢీ కొనగా కరుణాకరణ్​ అక్కడిక్కడే మృతి చెందాడు.

కొత్త దుస్తులు తీసుకువచ్చేందుకు వెళ్లిన కుమారుడు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలియగానే ఆకుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. కేసు నమోదు చేసుకున్న జగదేవపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: వరదల నేపథ్యంలో భాగ్యనగరంలో ఇళ్లు భద్రమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.