నిర్మల్ జిల్లా కుబీర్ మండలం హల్దా గ్రామానికి చెందిన సవిత, రాజు దంపతులు పని నిమిత్తం నిర్మల్‌కు వెళ్లారు. వీరు తిరిగి వస్తున్న క్రమంలో వానల్పాడ్ పెట్రోల్ పంపు వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. అక్కడే నిలుచుని ఉన్న కల్లూర్ గ్రామానికి చెందిన ఆనంద్ రావు, సునీతపైకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో సవిత అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురుకి గాయాలయ్యాయి. వారిని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: బాలుడి కిడ్నాప్‌కు విఫలయత్నం.. చివరికి..!