ETV Bharat / jagte-raho

ఉప్పల్​లో లారీ బీభత్సం.. ఒకరు మృతి - ఉప్పల్​లో రోడ్డు ప్రమాదం

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఉప్పల్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్​తో వచ్చిన లారీ డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ప్రహరిగోడను కూడా గుద్దింది. ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి.

ఉప్పల్​లో లారీ బీభత్సం.. ఒకరు మృతి
ఉప్పల్​లో లారీ బీభత్సం.. ఒకరు మృతి
author img

By

Published : Jan 1, 2021, 9:48 AM IST

ఉప్పల్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో డీసీఎంను వెనకనుంచి ఢీకొట్టింది. లారీ ఢీకొనడంతో డీసీఎం వ్యాన్​ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాద సమయంలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

లారీ ఢీకొన్న వేగానికి హనుమాన్‌ ఆలయం ప్రహరిగోడను సైతం కూలిపోయింది. ఇదే సమయంలో ప్రమాదానికి గురైన లారీని వెనకనుంచి మరో మినీ లారీ ఢీకొట్టింది. మినీ లారీలో ఉన్న నలుగురికి గాయాలవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఉప్పల్​లో లారీ భీభత్సం.. ఒకరు మృతి

ఇవీ చూడండి: అతివేగం ఖరీదు ఇద్దరి ప్రాణాలు.. ఒకరి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.