రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుతూనే ఉన్నాయి. తాజాగా జగిత్యాల జిల్లా తాటిపల్లి జాతీయ రహదారిపై కారును టిప్పరు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. కారు నుజ్జునుజ్జు కాగా.. టిప్పర్ ముందు టైర్లు పగిలి పోయాయి.
మృతుడు మంచిర్యాలకు చెందిన ఆంజనేయులుగా గుర్తించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవీ చూడండి: ఖనిజ పరిశ్రమల ప్రగతికి ప్రణాళికలు రూపొందించండి