రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న లారీ రెండు కార్లను ఢీ కొట్టింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న దుప్పట్ల కొట్టులోకి కారు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఇదీ చదవండి: 30 మందితో వెళ్తున్న బస్సుకు ప్రమాదం- ఒకరి మృతి