ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పలమనేరు జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలమాకులపల్లె వద్ద 3 వాహనాలు ఢీకొని నలుగురు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనగా... ఆ లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు, ద్విచక్రవాహనదారుడు మృతి చెందారు. కర్ణాటక నుంచి తిరుపతికి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మృతుల వివరాలను సేకరిస్తున్నారు. ద్విచక్రవాహనదారుడు బంగారుపాళ్యంకు చెందిన బాబుగా గుర్తించారు.
ఇదీ చదవండి: ఇంటి అద్దె కట్టలేక కన్నబిడ్డను అమ్మిన తల్లి!